తమ అందచందాలతో అందరి మనసులు కొల్లగొడుతుంటారు కథానాయికలు. అలాంటిది హీరోయిన్ నభా నటేష్‌ను మీ మనసు దోచుకోవాలంటే ఏం చేయాలని అడిగితే ఇలా చెప్పింది.
అలా ఉంటే నభా నటేష్‌కు మీరు నచ్చేస్తారు! - నభా నటేష్ వార్తలు
హీరోయిన్ నభా నటేష్ మనసు కొల్లగొట్టాలంటే కొన్ని లక్షణాలు ఉంటే చాలు. ఇంతకీ అవేంటి? వాటి సంగతులు ఆమె మాటల్లోనే.
"ఎదుటి వ్యక్తిలో నేను మొట్టమొదట చూసేది హాస్య చతురత. ఇది ఉంటే చాలు. ఆ తర్వాత సున్నితత్వం. ఎదుటి వాళ్ల ఆలోచనల్ని, భావోద్వేగాల్ని అర్థం చేసుకుని నడుచుకునే వాళ్లంటే చాలా ఇష్టం. అలా నా జీవితంలోకి ఒకరొచ్చారు. ఆయన పేరు షారుక్ ఖాన్. చిన్నప్పట్నుంచీ ఆయన సినిమాలు చూస్తూ అభిమానం పెంచుకున్నా. 'కుచ్ కుచ్ హోతా హై' ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. పాఠశాల, కాలేజీ వయసులో ఆకర్షణ అనేది ఉంటుంది కదా! అలా షారుక్ ఆకర్షణలో పడిపోయానంతే' అని నభా చెప్పింది.
ఈమె ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్' సినిమాల్లో నటిస్తోంది. ఇవి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.