తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రెడ్' ప్రయాణం.. కొత్త అనుభవం: నటి మాళవిక - రెడ్ మూవీ హీరోయిన్స్

హీరోయిన్ మాళవిక.. తాను నటించిన 'రెడ్' విశేషాలను పంచుకుంది. ఈ సినిమా ప్రయాణం సరికొత్త అనుభవాన్నిచ్చిందని తెలిపింది. ఈనెల 14న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

HEROINE MALVIKA SHARMA ABOUT RED MOVIE
'రెడ్' ప్రయాణం.. కొత్త అనుభవం: నటి మాళవిక

By

Published : Jan 7, 2021, 7:11 AM IST

ఈ సంక్రాంతికి కుర్రాళ్లును ఆకట్టుకునేందుకు వస్తోంది... మాళవిక శర్మ. నవతరం అమ్మాయిలకు ప్రతినిధిలా కనిపించే ఈ ముద్దుగుమ్మ రామ్‌తో కలిసి 'రెడ్‌'లో నటించింది. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకర్లతో కథానాయిక మాళవిక బుధవారం ముచ్చటించింది.

ఇ'లా'.. అవకాశం

"ఏడాదిన్నర విరామం తర్వాత నేను చేసిన మరో తెలుగు సినిమా 'రెడ్‌'. ఈ సినిమా ప్రయాణం ఓ కొత్త అనుభవాన్ని, అనుభూతిని పంచింది. 'నేల టికెట్‌' తర్వాత నేను హైదరాబాద్‌లోనే లా చదువుకుంటున్నా. ఆ సమయంలో స్రవంతి రవికిశోర్‌, దర్శకుడు కిశోర్‌ తిరుమల ఫ్రెష్‌ ఫేస్‌ అమ్మాయి కోసం వెదుకుతున్నారు. అలా ఆడిషన్‌ తర్వాత 'రెడ్‌'లో నటించే అవకాశం నన్ను వరించింది.

మాళవిక శర్మ

రామ్‌ ప్రత్యేకత అదే

"రామ్‌ స్వతహాగా చాలా రిజర్వ్‌డ్‌గా ఉంటారు. ఒక్కసారి కెమెరా ముందుకు వచ్చాడంటే చాలు... ప్రత్యేకమైన ఎనర్జీ వస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన వ్యక్తేనా అనేలా ఆయన కెమెరా ముందు కనిపిస్తుంటారు.

పరిణతితో...

"నిజ జీవితంలో నేనెలా ఉంటానో, అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేశా. మాట్లాడుతున్నప్పుడు నేను చేతుల్ని అటూ ఇటూ ఊపుతుంటాను. నా చేతుల కదలికల్ని బట్టే కొన్ని విషయాలు అర్థం అవుతుంటాయి. సినిమాలో నా పాత్ర అస్సలు అలా ఉండదు. చాలా పరిణతితో కనిపించేలా దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దారు.

నా డబ్బుతోనే లా చదివా

"మా తాతయ్యలా నేనూ న్యాయవాద వృత్తిలోకి అడుగు పెట్టాలనుకున్నా. నేను సంపాదించిన డబ్బుతో ఎల్‌.ఎల్‌.బి పూర్తి చేశా. అనుకున్న కలను నెరవేర్చుకున్నా. ఇప్పుడు నేను లైసెన్స్‌ పొందిన న్యాయవాదిని"

హీరోయిన్ మాళవిక

ABOUT THE AUTHOR

...view details