తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టైలిష్​గా కీర్తి సురేశ్ 'గాంధారి'.. పాటతో 'స్టాండప్​ రాహుల్' - రాజ్​తరుణ్ స్టాండప్ రాహుల్ మూవీ సాంగ్స్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో కీర్తి సురేశ్ 'గాంధారి' మ్యూజిక్ వీడియో, 'ది కశ్మీర్ ఫైల్స్', 'స్టాండప్ రాహుల్', కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

Keerthy suresh gandhari music video
కీర్తి సురేశ్ గాంధారి వీడియో

By

Published : Feb 21, 2022, 6:55 PM IST

Keerthy suresh gandhari: హీరోయిన్ కీర్తి సురేశ్ కొత్త ప్రయత్నం చేసింది. తొలిసారి ఓ మ్యూజిక్​ వీడియోలో నటించింది. 'గాంధారి' పేరుతో తెరకెక్కిన ఈ పాటను సోమవారం రిలీజ్ చేశారు. 'లవ్​స్టోరి'కి సంగీతమందించిన పవన్ సీహెచ్​.. ఈ సాంగ్​ను స్వరపరిచారు. బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

నృత్య ప్రధానంగా సాగే ఈ పాటలో కీర్తి సురేశ్‌ వేషధారణ, హావభావాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. సుద్దాల అశోక్‌ తేజ రచించిన ఈ పాటను అనన్య భట్‌ ఆలపించారు.

'ది తాష్కెంట్‌ ఫైల్స్‌' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి. ఆయన దర్శకత్వం వహించిన మరో సంచలన చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. 90వ దశకంలో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సామూహిక హత్యాకాండకు దృశ్యరూపం ఇస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇందులో మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కీలక పాత్ర పోషించిన ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. మార్చి 11వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Kiran abbavaram movies: 'సెబాస్టియన్' సినిమాతో హీరో కిరణ్​ అబ్బవరం.. త్వరలో థియేటర్లలోకి రానున్నాడు. అంతకు ముందే తన కొత్త సినిమా టైటిల్​, ఫస్ట్​లుక్​తో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. కోడి రామకృష్ణ కుమార్తె దివ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. బుధవారం.. ఈ చిత్ర టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

కిరణ్ అబ్బవరం మూవీ

ఇందులో కిరణ్ సరసన సంజన ఆనంద్ హీరోయిన్​గా నటిస్తోంది. కార్తిక్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

Raj tarun stand up rahul: రాజ్​తరుణ్.. స్టాండప్​ కమెడియన్​గా నటిస్తున్న సినిమా 'స్టాండప్ రాహుల్'. ఈ చిత్రంలోని 'తప్పా..?' అంటూ సాగే లిరికల్​ సాంగ్​ను హీరో నితిన్ ట్విట్టర్​లో రిలీజ్ చేశారు. ఆద్యంతం ఎంటర్​టైనింగ్​గా ఉన్న ఈ పాట.. సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

ఈ సినిమాలో రాజ్​ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్​గా చేస్తోంది. శాంటో దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్​పై క్లారిటీ ఇవ్వనున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details