తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరోయిన్​ కీర్తిసురేశ్​కు కరోనా పాజిటివ్​ - కీర్తిసురేశ్​కు కరోనా

హీరోయిన్​ కీర్తిసురేశ్​కు కరోనా సోకింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రతిఒక్కరూ జాగ్రత్త చర్యలు పాటించాలని, వ్యాక్సినేషన్​ తీసుకోవాలని కోరింది.

keerthi suresh corona
కీర్తిసురేశ్​కు కరోనా

By

Published : Jan 11, 2022, 5:29 PM IST

హీరోయిన్​ కీర్తిసురేశ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఇన్​స్టాలో పోస్ట్​ చేసిన ఆమె.. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పింది. ఈ మధ్య కాలంలో తనతో సన్నిహితంగా ఉన్నవారు కొవిడ్​ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. ప్రతిఒక్కరూ కరోనా జాగ్రత్త చర్యలు పాటించాలని, వ్యాక్సినేషన్​ తీసుకోవాలని కోరింది. త్వరలోనే కోలుకుని అందరీ ముందుకు వస్తానని పేర్కొంది.

కాగా, కీర్తిసురేశ్..​ 'సర్కారు వారి పాట', 'గుడ్​లక్​ సఖి'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే 'సాని కాయిదమ్'​, 'భోళా శంకర్'​, 'వాసి', 'దసరా' చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి:చెల్లి పాత్ర కోసం కీర్తిసురేశ్​ రెమ్యునరేషన్​ అంత?

ABOUT THE AUTHOR

...view details