ఇటీవల 'వకీల్‌సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన భామ అంజలి. తెలుగులోనే కాకుండా, తమిళ, కన్నడలోనూ తలో చిత్రంలో నటిస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. లాక్డౌన్లో చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుంటున్నారు మీది ఎప్పుడు అని అడగ్గా, ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర సమాధానమిచ్చింది.
Anjali: తన పెళ్లి గురించి హీరోయిన్ అంజలి..
తమిళ హీరో జై తో గత కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న హీరోయిన్ అంజలికి, పలు సందర్భాల్లో పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడు కూడా అలానే తన పెళ్లి ఎప్పుడు అని అడగ్గా, దానిపై స్పందించిందీ భామ.
హీరోయిన్ అంజలి
ప్రస్తుతం పూర్తి ఫోకస్ కెరీర్ మీదే ఉందని, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అంజలి తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈమె నటించిన తెలుగు సినిమా 'ఆనందభైరవి' విడుదల కావాల్సి ఉంది.
ఇవీ చదవండి: