చూడగానే మన పక్కింటి అమ్మాయిలా, తనదైన అల్లరితో సందడి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది సాయిపల్లవి. ఆకట్టుకొనే అందం, అందుకు తగ్గ అభినయమున్న ఇలాంటి అమ్మాయి చిత్రపరిశ్రమలో ఒక్కటే పీస్ అన్నంతగా కుర్రకారుకు మనసులను దోచేసింది. ఈ ముద్దుగుమ్మ 2015లో మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో అరంగేట్రం చేసింది. టాలీవుడ్లోకి 'ఫిధా'తో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఆ తర్వాత 'మిడిల్ క్లాస్ అబ్బాయి', 'కణం', 'పడి పడి లేచే మనసు'తో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నేడు ఆమె 28వ పుట్టినరోజు ఈ సందర్భంగా.. మిలియన్ వ్యూస్ సాధించిన సాయిపల్లవి పాటల విశేషాలు మీకోసం.
నటనలోనే కాదు డ్యాన్స్‌లోనూ
దక్షిణాది హీరోయిన్లలో నటనతోనే కాకుండా డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటుంది సాయిపల్లవి. నెట్టింట్లో ఆమె పాటలు, ఫొటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఆమె పాటలు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి.
'మలర్' ఓ సంచలనం
సాయిపల్లవి నటించిన తొలి సినిమా 'ప్రేమమ్'. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. అందులో 'మలరే....' అంటూ సాగే గీతంతో సాయిపల్లవి పాపులర్ అయిపోయింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.