కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్: ఛాప్టర్ 1' బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించడం వల్ల సీక్వెల్‌పై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా.. జనవరి 8న హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' టీజర్‌ను ఒక్కరోజు ముందే విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో సినిమాపై భారీగా ఆసక్తి రేపుతోంది. ఇందులో హీరో యశ్, ప్రతినాయకుడిగా కనిపించిన సంజయ్ దత్(వెనుక నుంచి) లుక్స్ అదిరిపోయాయి.
'కేజీఎఫ్ 2' టీజర్: మాట నిలబెట్టుకుంటానంటున్న యశ్ - 'kgf 2' movie teaser released
జనవరి 8న హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్: చాప్టర్ 2' టీజర్‌ను ఒక్కరోజు ముందే విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ ఆద్యంతం సినిమాపై భారీగా ఆసక్తి రేపుతోంది.
కేజీఎఫ్
'కేజీఎఫ్: చాప్టర్ 2' షూటింగ్ దాదాపు పూర్తైంది. సీక్వెల్లో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
Last Updated : Jan 7, 2021, 9:50 PM IST