తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'థియేటర్​, ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​కు ఉన్న తేడా అదే' - hero viswaksen at Raja Vaaru Rani Gaaru Pre-Release Event

హైదరాబాద్​లో జరిగిన 'రాజావారు రాణిగారు' సినిమా ప్రీరిలీజ్​ ఈవెంట్​కు హాజరైన హీరో విశ్వక్​సేన్.. ఓ సినిమాను థియేటర్​లో, ఓటీటీలో చూడటానికి గల తేడాను ఉదాహరణతో సహా చెప్పాడు.

'థియేటర్​, ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​కు ఉన్న తేడా అదే'
హీరో విశ్వక్​సేన్

By

Published : Nov 28, 2019, 10:53 AM IST

ప్రస్తుతం థియేటర్​కు వెళ్లి సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. అందుకు కారణమూ లేకపోలేదు. చిత్రం విడుదలైన నెల, నెలన్నర వ్యవధిలో ఓటీటీ(అమెజాన్ ప్రైమ్, నెట్​ఫ్లిక్స్​) మాధ్యమాల్లో వచ్చేస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు... వెండితెరపై సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. తాజాగా ఇదే విషయంపై హీరో విశ్వక్​సేన్ మాట్లాడాడు. హైదరాబాద్​లో జరిగిన 'రాజావారు రాణిగారు' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో ఈ రెండింటి మధ్య తేడాను ఓ ఉదాహరణతో వివరించాడు.

రాజావారు రాణిగారు ప్రీరిలీజ్ ఈవెంట్

"కుటుంబంతో కలిసి చూడగలిగే స్వచ్ఛమైన ప్రేమకథ ఈ సినిమా. చూస్తున్నంతసేపు థియేటర్​లో ఉన్నట్లు లేదు. దీనిని ఓటీటీ ఫ్లాట్​ఫామ్స్​లోనూ చూడండి పర్లేదు. అయితే థియేటర్​లో చూస్తే ఫ్యామిలీతో కలిసి తిన్నట్లు ఉంటుంది. ఓటీటీలో చూస్తే మీరు ఒంటరిగా రెస్టారెంట్​కు పోయి తిన్నట్లు ఉంటుంది" -విశ్వక్​సేన్, హీరో

'రాజావారు రాణిగారు'లో కిరణ్ అబ్బవరం​, రహస్య గోరఖ్ హీరోహీరోయిన్లుగా నటించారు. గ్రామీణ నేపథ్య ప్రేమకథతో తెరకెక్కింది. రవి కిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: ప్రేమకథతో వస్తున్న 'రాజావారు.. రాణిగారు'

ABOUT THE AUTHOR

...view details