తన నటనతో కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమలో సైతం ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు నటుడు విశాల్. ఆయన పెళ్లి గురించి ఎంతో కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే వివాహం గురించి ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని.. వేరొకరితో రిలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. అంతేకాకుండా తాను విధిని నమ్ముతానని.. కాబట్టి, దేవుడు ఎలాంటి రాతను రాస్తే జీవితం అలా కొనసాగుతుందని.. ఇప్పటివరకూ అలాగే జరిగిందని తెలిపారు. త్వరలోనే ఓ శుభవార్త చెప్పాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా అందరికీ వెల్లడిస్తానని విశాల్ ఇటీవలే ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
పెళ్లిపై విశాల్ స్పందన.. త్వరలోనే శుభవార్త! - విశాల్ చక్ర
కోలీవుడ్ హీరో విశాల్ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నట్లు విశాల్ స్పష్టం చేశారు. వేరొకరితో రిలేషన్‌లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనని.. దేవుడు ఎలాంటి రాత రాస్తే జీవితం అలా కొనసాగుతుందని తెలిపారు.
పెళ్లిపై విశాల్ స్పందన.. త్వరలోనే శుభవార్త!
'యాక్షన్' తర్వాత విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'చక్ర'. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎస్.ఆనందన్ దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. రెజినా కసెండ్రా కీలకపాత్ర పోషించారు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు విశాల్ 'తుప్పరివాలం-2' స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి:కంగనపై ఈ-మెయిల్ కేసులో హృతిక్‌కు సమన్లు