తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2020, 1:03 PM IST

ETV Bharat / sitara

'ధైర్యంగా ఉంటేనే కరోనాను ఎదుర్కోగలం'

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు తమిళ హీరో విశాల్​. భయాన్ని వీడినప్పుడే మహమ్మారిని జయించవచ్చని పేర్కొన్నాడు.

hero vishal Awareness about corona
విశాల్​

కరోనా వైరస్​ బారిన పడిన వారు భయాన్ని వీడాలని సూచించాడు తమిళ కథానాయకుడు విశాల్. ఇటీవలే తన తండ్రితో పాటు, తాను, మేనేజర్​ కరోనా బారిన పడి.. మూడు వారాల్లోనే కోలుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ మహమ్మారి చికిత్సలో ఆయుర్వేదిక్​, హోమియోపతి మందులు​ బాగా పనిచేశాయని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ఓ వీడియోను పంచుకున్నాడు.

తాను ఏ మెడిసిన్​ కోసం ప్రచారం చేయడం లేదని చెప్పిన విశాల్​.. ఎలా కోలుకున్నామో చెప్పడానికి ఆయుర్వేదిక్​, హోమియోపతి మందుల పేర్లను సామాజిక మాధ్యమాల్లో చెప్పినట్లు వెల్లడించాడు. ధైర్యంగా ఉంటే కరోనాను ఎదర్కోగలమని విశాల్​ తెలిపాడు. సామాజిక బాధ్యతగానే ఈ వీడియోను పోస్ట్​ చేస్తన్నట్లు స్పష్టం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details