సెలబ్రిటీల ఇళ్లు ఎంత విలాసవంతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంటీరియర్ డిజైనింగ్ తమ అభిరుచులకు తగ్గట్లు ప్రత్యేకంగా చేయించుకుంటుంటారు. వాటికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా ఎందుకు చెప్పున్నాను అనుకుంటున్నారా?
'అర్జున్ రెడ్డి'తో సెన్సేషనల్ హీరోగా మారారు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంతో యువతలో ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి హిట్ సినిమాలతో అభిమానులను అలరించారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాలో నటిస్తున్న ఈయన.. సోషల్‌మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. తాను ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలను పంచుకుంటుంటారు. అలా పంచుకున్న వాటిలో.. ఆయన ఇంటికి సంబంధించిన ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ చాలా క్లాస్‌గా ఉంది. దీంతో ఆయన ఇంటికి సంబంధించిన ఫొటోలను అభిమానులు తెగ వెతికేస్తున్నారట!. వాటిని మనం ఓ సారి చూసేద్దాం..