తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. రికార్డుల వేట..! - విజయ్​ కొత్త సినిమా

'ఖైదీ' దర్శకుడు లేకేష్​ కనకరాజ్​.. విజయ్​ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ అమెజాన్​ ప్రైమ్​ అత్యధిత మొత్తం చెల్లించి డిజిటల్​ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం.

hero vijay recorded at his movie digital rights brought by amazon prime
ఓ పక్క షూటింగ్ జరుగుతుండగానే.. రికార్డుల మోత

By

Published : Dec 7, 2019, 3:12 PM IST

కోలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు ఇళయ దళపతి విజయ్ సినిమా విడుదల కావడమే ఆలస్యం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తుంది. తాజాగా విజయ్​ 'ఖైదీ' దర్శకుడు లోకేష్​ కనకరాజ్​ డైరెక్షన్​లో తన 64వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. డిజిటల్​ మాధ్యమంలో అగ్ర స్థానంలో ఉన్న అమెజాన్​ ప్రైమ్​ ఈ చిత్రాన్ని ఇప్పటి వరకు ఏ తమిళ సినిమాకు ఇవ్వనంత డబ్బు చెల్లించి డిజిటల్​ హక్కులు సొంతం చేసుకుందని సమాచారం. ఫలితంగా చిత్రీకరణ సమయంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీలో విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. 'మంచి కెరీర్​ కావాలంటే సల్మాన్​ను ఫాలో అవ్వండి'

ABOUT THE AUTHOR

...view details