తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ పోలీస్ అయ్యుంటే? - corona latest news

యువకథానాయకుడు విజయ్ దేవరకొండ.. విధుల్లో నిర్వర్తిస్తున్న పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించాడు. వారు అడిగిన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

ఈ పరిస్థితుల్లో విజయ్ దేవరకొండ పోలీస్ అయ్యుంటే?
హీరో విజయ్ దేవరకొండ

By

Published : Apr 14, 2020, 4:13 PM IST

Updated : Apr 14, 2020, 6:48 PM IST

పోలీసులతో వీడియో కాన్ఫరెన్స్​లో హీరో విజయ్ దేవరకొండ

లాక్​డౌన్ సమయంలో ప్రాణాలకు తెగించి ఉద్యోగం చేస్తున్న పోలీసు అధికారుల‌తో ముచ్చ‌టించాడు యువహీరో విజ‌య దేవ‌ర‌కొండ. సోమ‌వారం సాయంత్రం క‌మీష‌న‌రేట్​లో, హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది.

నిరంత‌రం ప‌నిచేస్తూ అల‌స‌ట పొందుతున్న పోలీసు సిబ్బందికి విజ‌య్ ప‌ల‌క‌రింపులు, మాటలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయ‌ని అధికారుల‌ు అన్నారు. ఈ సంద‌ర్భంగా పోలీస్​లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు విజ‌య్ స‌మాధానాలు చెప్పాడు.

  • మీరు ఒక‌సారి పోలీస్ చెక్ పోస్ట్​ల ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను బ‌య‌టకు రావొద్ద‌ని కోరాలి

"త‌ప్ప‌కుండా వ‌స్తాను కానీ నేను వ‌చ్చిన‌ప్పుడు మీ లాఠీల‌కు ప‌నిచెప్ప‌కూడ‌దు అలాంటి పర్మిషన్ లెట‌ర్ ఇస్తే త‌ప్ప‌కుండా వ‌స్తాను. కానీ సీఎం కేసీఆర్ సార్ చాలా క్లియ‌ర్​గా బ‌య‌ట‌కు రావొద్దని చెప్పారు. వాళ్లు చెప్పాక బ‌య‌ట తిరిగే వాళ్ల‌కు మీ ప‌ద్ధతిలోనే స‌మాధానం చెప్పాలి. నేను వ‌చ్చి చెబితే మంచి జ‌రుగుతుంది అని మీరు న‌మ్మితే త‌ప్ప‌కుండా వ‌స్తాను"

హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్​తో హీరో విజయ్ దేవరకొండ
  • లాక్​డౌన్ సమయంలో మీరు మీ అమ్మ‌కు స‌హాయం చేస్తున్నారా?

నేను షూటింగ్​ల్లో బిజీగా ఉండేట‌ప్పుడు ఇంట్లో విష‌యాల్ని ప‌ట్టించుకునే వాడ్ని కాదు. కానీ ఇప్పుడు అమ్మ ప‌డుతున్న క‌ష్టం చూస్తే మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. నేను స‌హాయం చేయ‌డానికి వెళ్లిన‌ప్పుడు, నీవ‌ల్ల మ‌రింత ప‌ని పెరుగుతుంద‌ని కోప్ప‌డుతుంది. కానీ ఇలాంటి స‌మ‌యంలో డ్యూటీలు చేస్తూ ఇంటి ప‌నిని చ‌క్క బెడుతున్న మ‌హిళా అధికారుల‌కు హేట్సాఫ్"

  • పోలీస్ అధికారిగా మిమ్మ‌ల్ని చూడాల‌నుకుంటున్నాం

"త‌ప్ప‌కుండా మంచి స్క్రిప్ట్ వ‌స్తే చేస్తాను. రెండు మూడేళ్లలో మంచి పోలీసు పాత్ర‌తో మీ ముందుకు వ‌స్తా"

  • మీరు పోలీస్ అయితే ఈ సిట్యువేష‌న్​ను ఎలా ఫీలయ్యే వారు?

"చాలా బాధ్య‌త‌గా ఫీల్ అయ్యే వాడిని. క‌మీష‌న‌ర్ గారి ఆదేశాల మేర‌కు ప‌నిచేసే వాడిని. మీరంద‌రూ మా కోసం ప‌నిచేస్తున్నారు. మేం ఇంట్లో కూర్చుంటే మీరు ప‌నిగంట‌లు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు మీ అంద‌రికీ నా న‌మ‌స్కారాలు"

వీడియో కాన్ఫరెన్స్​లో పోలీసులతో విజయ్ మాటామంతీ
  • మీరు డిప్ర‌ెష‌న్​లో ఉంటే ఏం చేస్తారు?

"నా ప‌నే నాకు గుర్తింపు నిచ్చింది. మీ అంద‌రి ప్రేమ‌నిచ్చింది. నాకు ఫెయిల్యూర్స్ వ‌చ్చినా ఎప్పుడైనా లో ఫీల్ క‌లిగినా నా ప‌ని మీద మ‌రింత ఫోక‌స్ చేస్తాను. నేను చిన్న‌ప్పుడు స్కూల్లో మ‌హాభార‌తం ప్లే చేసాను. అప్పుడు కృష్ణ భగవానుడు అన్న ఆ మాట నా మీద బాగా బ‌లంగా ప‌డింది. 'ఈ స‌మ‌యం గ‌డిచిపోతుంది. నిజ‌మే ఏ స‌మ‌యం అయినా శాశ్వతం కాదు'. క‌రోనా అంతే. మ‌నం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్​.. మ‌న జీవితంలో ఓ జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది"

చాలా మంది పోలీసు అధికారులు విజ‌య్​కు ధన్యవాదాలు చెబుతూ త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. పోలీసులలో ఉత్సాహాన్ని నింపేందుకు సమయం ఇచ్చిన విజయ్​కు పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్​తో పాటు ఆయన సిబ్బంది కృతజ్ఞతలు చెప్పారు.

Last Updated : Apr 14, 2020, 6:48 PM IST

ABOUT THE AUTHOR

...view details