శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బ్రోచేవారెవరురా'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హీరోయిన్లు నివేదా థామస్, నివేదా పేతురాజ్, సహాయ పాత్రల్లో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తమ నటనతో ఆకట్టుకున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వ ప్రతిభను అందరూ మెచ్చుకుంటున్నారు.
వెంకటేశ్ నుంచి ఫోన్... హీరో షాక్ - వెంకటేశ్
'బ్రోచేవారెవరురా' చిత్రాన్ని చూసిన హీరో వెంకటేశ్ చిత్రబృందాన్ని అభిందించారు. ఈ విషయన్ని హీరో శ్రీ విష్ణు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
వెంకటేశ్ ఫోన్.
హాస్యంతో పాటు సందేశాత్మకంగా ఉన్న ఈ చిత్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. శనివారం ఉదయం శ్రీవిష్ణుకు హీరో వెంకటేశ్ ఫోన్ చేసి అభినందించారు. ఇది తన ఫీలింగ్ అంటూ ఓ ఫొటోను జత చేసి ట్విట్టర్లో ఆనందాన్ని పంచుకున్నాడీ కథానాయకుడు.
ఇవీ చూడండి.. హాలీవుడ్ కోసం నాని 'కొడుకు' అవతారం