తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్ వేళ బాక్సింగ్​తో వరుణ్ బిజీ​ - వరుణ్​తేజ్​ బాక్సర్​

విరామ సమయంలోనూ కసరత్తులు చేస్తున్నాడు యువకథానాయకుడు వరుణ్​తేజ్​. బాక్సింగ్​ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రానికి సంబంధించిన వార్మప్​ చేస్తున్న వీడియోను ట్విట్టర్​లో షేర్​ చేశాడు. ఈ చిత్రం ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

Hero VarunTej Shared a video in Instagram
విరామంలోనూ విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న వరుణ్​

By

Published : May 13, 2020, 5:40 PM IST

లాక్​డౌన్​ కారణంగా చిత్రీకరణలన్నీ నిలిచిపోయిన క్రమంలో తారలంతా ఇంటికే పరిమితమయ్యారు. యువకథానాయకుడు వరుణ్​ తేజ్ హీరోగా బాక్సింగ్​ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. దానికి సంబంధించిన కసరత్తులు చేస్తున్న వీడియోను ట్విట్టర్​​లో షేర్​ చేశాడీ హీరో. "నాకు నేను బలహీనంగా ఉన్నా అనిపించిన ప్రతిసారి.. బాక్సింగ్​ బ్యాగ్‌ను మరింత గట్టిగా కొడుతున్నా" అంటూ పోస్ట్​ చేశాడు. ఈ చిత్రానికి దర్శకుడిగా కిరణ్‌ కొర్రపాటి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్​ నిలిచిపోయింది.

విలన్​గా యంగ్​హీరో

గతేడాది విడుదలైన 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలో నెగటివ్ ​రోల్​లో నటించిన యువ కథానాయకుడు నవీన్​చంద్ర.. ప్రస్తుతం వరుణ్​తేజ్​ కొత్త చిత్రంలోనూ నెగటివ్​రోల్​లో కనిపించనున్నాడని సమాచారం. కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర ఓ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఇదీ చూడండి..'వచ్చే ఏడాది నిహారిక.. ఆ తర్వాత వరుణ్​ పెళ్లి'​

ABOUT THE AUTHOR

...view details