మెగాహీరో వరుణ్‌తేజ్‌కు ఊహించని బహుమతులు వచ్చాయి. సూపర్‌హీరోస్ చిత్రాలు నిర్మించే హెచ్‌బీఓ కంపెనీ.. బ్యాట్‌మ్యాన్, సూపర్‌మ్యాన్, ఆక్వామ్యాన్కు చెందిన కొన్ని వస్తువులను ఈ కథానాయకుడికి పంపింది. వాటిని ఫొటోలు తీసి, ఇన్‌స్టాలో పంచుకున్నాడు వరుణ్. సూపర్హీరోస్పై తన అభిమానానికి గుర్తుగా వీటిని పంపించిన హెచ్‌బీఓ ఇండియాకు ధన్యవాదాలు చెప్పాడు.
ప్రత్యేక బహుమతులతో వరుణ్‌తేజ్ సర్ప్రైజ్ - entertainment news
హెచ్‌బీఓ సంస్థ నుంచి హీరో వరుణ్ తేజ్‌కు ఊహించని బహుమతులు వచ్చాయి. వాటి ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
హీరో వరుణ్ తేజ్
ప్రస్తుతం 'బాక్సర్' టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇందులోని తన పాత్ర కోసం అమెరికన్ బాక్సర్, భారత్‌కు చెందిన ప్రముఖ బాక్సర్ నీరజ్ గోయత్ల వద్ద శిక్షణ తీసుకున్నాడు. కిరణ్ కొర్రపాటి.. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
Last Updated : Feb 29, 2020, 3:56 PM IST