కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న చిత్రం 'హీరో'. ఇటీవలే విడుదల చేసిన టీజర్లోని సన్నివేశాలు ఆసక్తి కలిగించాయి. శుక్రవారం ట్రైలర్ను అభిమానులతో పంచుకున్నారు. ఇందులోని సీన్స్ చూస్తుంటే విద్యా వ్యవస్థకు సంబంధించిన ఆసక్తికర కథాంశంతో సినిమా తీసినట్లు తెలుస్తోంది.
ట్రైలర్: శక్తిమాన్లా సూపర్'హీరో' అవుతా - Sivakarthikeyan cinemas
శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తమిళ సినిమా 'హీరో' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాల గురించి ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తోంది.
శివకార్తికేయన్ హీరో
ఈ చిత్రంతో కల్యాణి ప్రియదర్శన్ తమిళ సినీ పరిశ్రమకు పరిచయమవుతోంది. అర్జున్, అభయ్ దేఓల్, ఇవానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు. 'అభిమన్యుడు' ఫేమ్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇది చదవండి: విజయ్ దేవరకొండ కోసం గూగుల్లో తెగ వెతికారు
Last Updated : Dec 13, 2019, 2:45 PM IST