నటీనటులు అంటే ఎక్కడైనా సరే నటించేందుకు సిద్ధంగా ఉంటారు. కానీ గత 12 ఏళ్లుగా పలు చిత్రాలు చేసిన టాలీవుడ్ హీరో సుశాంత్ మాత్రం, పబ్లిక్‌లో డ్యాన్స్ చేసేందుకు సిగ్గుపడ్డాడట. ఈ విషయాన్ని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడ్డ హీరో సుశాంత్! - sushanth Meenakshi Chaudhary
కొత్త సినిమా షూటింగ్లో భాగంగా జనాల మధ్య డ్యాన్స్ చేసేందుకు హీరో సుశాంత్ ఇబ్బంది పడ్డాడట. తానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పాడు.
ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకులు ముందుకొచ్చాడు సుశాంత్. ప్రస్తుతం 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు' చిత్రంలో నటిస్తున్నాడు. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే వర్షంలో ఓ పాట చిత్రీకరణ చేశారు. కానీ జనాల మధ్య డ్యాన్స్ చేసేందుకు సుశాంత్ సిగ్గుపడ్డాడు. ఇప్పటివరకు స్టూడియోల్లో, ఫారిన్ లొకేషన్స్‌లో మాత్రమే అతడు డ్యాన్స్‌లు చేయడమే ఇందుకు కారణం. దీంతో తొలుత కొంచెం ఇబ్బందిపడినా సరే తనను తాను సిద్ధం చేసుకుని, గీతాన్ని పూర్తి చేశాడు.
ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి శంకర్, హరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.