మన కథానాయకులు నటనకి మాత్రమే అంకితం అయిపోకుండా అప్పుడప్పుడు గొంతు సవరించుకొని పాటలు కూడా పాడుతుంటారు. ఇప్పుడా జాబితాలోకి సూర్య వచ్చేశాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో... సుధ కొంగర దర్శకత్వంలో 'ఆకాశం నీ హద్దురా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు జి.వి.ప్రకాశ్ సంగీత దర్శకుడు.
సినిమాలోని నేపథ్య సంగీతంలో భాగంగా వచ్చే లిరిక్స్‌కు గొంతు కలపనున్నాడు సూర్య. ఈ విషయాన్ని ఒక ఫొటో ద్వారా సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు సంగీత దర్శకుడు ప్రకాశ్. ఇద్దరూ కలిసి వాయిస్ రికార్డింగ్ థియేటర్‌లో తీసుకున్న ఫొటోని షేర్ చేశాడు.