అగ్ర కథానాయకుడు సూర్య హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. ఇది అతడి కెరీర్ 38వ సినిమాగా రూపొందుతోంది. దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. నూతన సంవత్సర కానుకగా నేడు మరో లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ జనవరి 7న విడుదల చేయనున్నారు. వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఆకాశం నీ హద్దురా'లో సూర్య కొత్త లుక్ ఇదే... - sarvam thalamayam actress aparna
తమిళ కథానాయకుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'సూరరై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' టైటిల్‌తో విడుదల కానుంది. నేడు ఈ సినిమాలోని సూర్య లుక్‌తో పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
'ఆకాశం నీ హద్దురా'లో సుర్య కొత్త లుక్ ఇదే...
సామాన్యుడికి విమాన సౌకర్యం అందించిన ఎయిర్ దక్కన్ వ్యవస్థాపకులు పైలెట్ జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రమిది. ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇందులో ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. 'సర్వం తాళమయం' ఫేం అపర్ణ బాలమురలి హీరోయిన్‌గా నటిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Last Updated : Jan 2, 2020, 7:12 AM IST