తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నా జీవితంలో ముఖ్యమైన సినిమా ఇది: సూర్య - హీరో సూర్య వార్తలు

'ఆకాశమే నీ హద్దురా!' సినిమా తన జీవితంలో ఎంతో ముఖ్యమైనదని చెప్పిన హీరో సూర్య.. ప్రచారంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమిళ వెర్షన్ అక్టోబరు 30 నుంచి అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్​పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

hero suriya in 'aakasam nee haddura' promotions
నా జీవితంలో ముఖ్యమైన సినిమా ఇది: సూర్య

By

Published : Oct 12, 2020, 6:45 AM IST

దర్శకురాలు సుధా కొంగర స్క్రిప్టుకు బదులుగా 40 పేజీల సారాంశంతో కూడిన పుస్తకాన్ని చేతికిచ్చారని తమిళ కథానాయకుడు సూర్య అన్నారు. ఆయన నటించిన సినిమా 'ఆకాశం నీ హద్దురా!'. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించారు. సుధా కొంగర దర్శకత్వం వహించారు. అక్టోబరు 30న ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషించారు. అపర్ణ బాలమురళీ కథానాయిక. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా 'స్క్రిప్టు టు స్క్రీన్‌' మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఇందులో యూనిట్‌ సభ్యులు తమ అనుభవాల్ని పంచుకున్నారు. పదేళ్ల క్రితం కెప్టెన్‌ గోపీనాథ్‌ ఇంటర్వ్యూ చూశానని, అప్పుడు 'సాలా ఖడూస్‌' (తెలుగులో 'గురు') కథ రాశానని సుధ చెప్పారు. ఆపై 'సింప్లీ ఫ్లై' పుస్తకం చదివిన తర్వాత చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందని వివరించారు.

'ఆకాశమే నీ హద్దురా!' సినిమాలో సూర్య

'ఈ సినిమాకు అన్నీ సమకూరక ముందే సుధ 40 పేజీల సారాంశంతో కూడిన పుస్తకాన్ని నాకు ఇచ్చారు. 'ఇది మీకు సరిపోతుందో? లేదో? నాకు తెలియదు. ఒక్కసారి చదవండి' అని చెప్పారు. అది చదివిన తర్వాత నాకు ఎంతో ఉత్సుకతగా అనిపించింది. సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి ముందే సుధ యూనిట్‌ సభ్యులతో స్క్రిప్టు సెషన్‌ నిర్వహించారు. దాని వల్ల అందరికీ తమ పాత్రలపై ఓ అవగాహన ఏర్పడింది. ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది అలాంటి వ్యక్తి కథ. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన సినిమా ఇది. ఇందులో నటించడం కొత్త అనుభవాన్ని ఇచ్చింది' అని హీరో సూర్య చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details