తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమా కోసం 12 కిలోలు తగ్గిన సందీప్ - ఆ సినిమా కోసం 12 కిలోలు తగ్గిన సందీప్

'A1 ఎక్స్​ప్రెస్'లో నటిస్తున్న సందీప్ కిషన్.. తన పాత్ర కోసం ఫిట్​గా కనిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకున్నారు.

ఆ సినిమా కోసం 12 కిలోలు తగ్గిన సందీప్
హీరో సందీప్ కిషన్

By

Published : Jun 19, 2020, 8:35 PM IST

లాక్‌డౌన్‌ కాలాన్ని సినీ తారలు చక్కగా ఉపయోగించుకున్నారు. సమంత వ్యవసాయం, వంట నేర్చుకున్నారు.. తమన్నా ఆవకాయ చేశారు. రాధికా ఆప్టే సొంతంగా సినిమా కథలు రాశారు. ఇంకొంత మంది సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేశారు. అదేవిధంగా యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌ లాక్‌డౌన్‌లో తన కొత్త సినిమా కోసం 12 కిలోల బరువు తగ్గారు.

సందీప్ కిషన్ సిక్స్​ప్యాక్ ఫొటో

గతేడాది సందీప్ కిషన్.. 'నిను వీడని నీడను నేనే', 'తెనాలి రామకృష్ణ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం 'A1 ఎక్స్‌ప్రెస్‌'లో నటిస్తున్నారు. ఇందులో హాకీ క్రీడాకారుడిగా కనిపించనున్నారు. ఇందుకోసం సిక్స్‌ప్యాక్‌లో మరింత ఫిట్‌గా తయారయ్యారు. ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కుల్‌దీప్‌ శిక్షణ మేరకు కసరత్తులు చేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోను ఇన్​స్టాలో షేర్‌ చేశారు. సందీప్‌ అంకితభావాన్ని, శ్రమించే తత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

'A1 ఎక్స్‌ప్రెస్‌'లో లావణ్య త్రిపాఠి కథానాయిక. డెన్నీస్‌ జీవన్‌ దర్శకుడు. మురళీ శర్మ, రావు రమేశ్‌, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్‌హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు. మరోపక్క సందీప్‌ హీరోగా 'నరగాసురన్', 'కన్నాడి', 'కశడ థపార్‌' అనే తమిళ సినిమాలు తీయనున్నారు. ఇవన్నీ ప్రొడక్షన్‌ పరంగా వివిధ దశల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details