తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమానులతో సందీప్​ కిషన్ ఓ రోజు - అన్య సింగ్

టాలీవుడ్​ హీరో సందీప్ కిషన్​.. తను నటిస్తున్న 'నిను వీడని నీడను నేనే' చిత్రీకరణకు అభిమానుల్ని ఆహ్వానించాడు. వారితో కలిసి భోజనం చేసి, ముచ్చటించాడు.

అభిమానులతో సందీప్​ కిషన్ ఓ రోజు

By

Published : Jul 7, 2019, 8:13 PM IST

అభిమానులతో ఓ రోజు గడిపిన హీరో సందీప్ కిషన్

యువ కథానాయకుడు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం "నిను వీడని నీడను నేనే". సినిమా ప్రచారంలో భాగంగా అభిమానుల్ని షూటింగ్​కు ఆహ్వానించాడీ కథానాయకుడు. ఇందులో సిద్దార్థ్ ఆలపించిన 'రాక్షసి' పాట చిత్రీకరణను స్వయంగా చూపించాడు.

వారితో కలిసి భోజనం చేసిన సందీప్... అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. తన చిత్రానికి నిర్మాతగా అవసరమైన దానికంటే ఎక్కువగానే ఖర్చు పెడుతున్నానని చెప్పాడు.

అన్య సింగ్​ హీరోయిన్​గా నటించింది. వెన్నెల కిశోర్​ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కార్తిక్ రాజ్​ దర్శకత్వం వహించాడు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇది చదవండి: సందీప్​ను వీడని నీడ.. కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details