'సర్కారు వారి పాట'తో బిజీగా ఉన్న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తారు. అయితే ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికర విషయం వినిపిస్తోంది. అలానే ఈ ప్రాజెక్టు పూజా కార్యక్రమం, మే చివర్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని హీరో? - శిల్పాశెట్టి మహేశ్‌బాబు త్రివిక్రమ్ ఫిల్మ్
హీరో మహేశ్- దర్శకుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో అక్కినేని కథానాయకుడు ఒకరు నటించనున్నారట. ఇంతకీ ఎవరా హీరో?
మహేశ్‌బాబు సుమంత్
మహేశ్-త్రివిక్రమ్ సినిమాలో అక్కినేని కథానాయకుడు సుమంత్ ఓ కీలక పాత్ర చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ గత చిత్రం 'అల వైకుంఠపురములో' సినిమాలో అక్కినేని సుశాంత్ కీలక పాత్ర పోషించారు. మరి తన కొత్త సినిమాలో ఒకవేళ సుమంత్ నటిస్తే, త్రివిక్రమ్ అతడిని ఎలాంటి పాత్రలో చూపిస్తారో?