కథానాయకుడు సుమంత్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారని ఇటీవలే సోషల్మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. పవిత్ర అనే అమ్మాయిని ఆయన పెళ్లాడనున్నట్లు.. ఓ పెళ్లి పత్రిక వైరల్గా మారింది. దీనిపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ వ్యంగ్యంగా స్పందించగా.. దీనికి సమాధానంగా సుమంత్ ఓ వీడియో ట్వీట్ చేశారు.
"అందరికీ నమస్తే.. ఈ మధ్య నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అందరికీ స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. నిజ జీవితంలో నేను పెళ్లి చేసుకోవడం లేదు. విడాకులు తీసుకోవడం.. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాను. అలాంటి కథతో ఓ సినిమా రావడం తెలుగులో ఇదే తొలిసారి. సినిమా చిత్రీకరణ సందర్భంగా ఆ సినిమాలోని ఓ వెడ్డింగ్ కార్డు బయటికి వచ్చింది. అదే అపార్థాలకు దారి తీసింది."
- సుమంత్, కథానాయకుడు