తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"మీరూ ఇలా ప్రయత్నించండి" అంటున్న సుధీర్ బాబు - tollywood

టాలీవుడ్ నటుడు  సుధీర్ బాబు అవుట్​డోర్​లో కొత్త రకమైన ఫీట్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

సుదీర్

By

Published : Sep 14, 2019, 4:47 PM IST

Updated : Sep 30, 2019, 2:28 PM IST

ఫిట్​నెస్ విషయంలో ఎంతో శ్రమిస్తుంటాడు టాలీవుడ్ హీరో సుధీర్ బాబు. చిత్రసీమలోకి ప్రవేశించాక జిమ్‌లో కసరత్తులు పెంచాడు. తాజాగా భిన్నమైన ఫీట్ చేస్తున్న ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడీ హీరో. నెటిజన్లు అతడి శ్రమకు ఫిదా అవుతున్నారు.

చాలా మంది సినీ తారలు ఉదయాన్నే లేచి నడక లేక జిమ్‌లో గడుపుతుంటారు. కానీ హీరో సుధీర్‌ ఇప్పుడు అవుట్‌డోర్‌లో కొత్త రకమైన ఫీట్‌ను చేస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాడు. కారుతో సుధీర్‌ చేస్తున్న ఫీట్‌ను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. "మనం చేసే వ్యాయామం విసుగు లేకుండా ఉండాలి అంటే నా ఫిజికల్‌ ట్రైనర్‌ జాఫర్‌ అలీ చెప్పినట్టు నా కారును తోస్తున్నాను. ఇందువల్ల శారీరకంగా బాగుంటుంది. కొంచెం కారు ఇంధనమూ ఆదా అవుతుంది. మీరూ ఇలా ప్రయత్నిండి.." అంటూ రాసుకొచ్చాడు.

ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' అనే చిత్రంలో నటిస్తున్నాడు సుధీర్.

ఇవీ చూడండి.. యాషెస్​: స్మిత్​ చేతిలో ఇంజమామ్​ రికార్డు బ్రేక్​

Last Updated : Sep 30, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details