తమిళ హీరో శింబు తన కొత్త సినిమా 'ఈశ్వరన్' సిబ్బందికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. దీపావళి బహుమతి కింద ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ ఒక గ్రాము బంగారు నాణెం, కొత్త బట్టలను బహుమతిగా అందించాడు. అయితే.. కోలీవుడ్‌లో ఈ సంప్రదాయం.. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత రజినీకాంత్, విజయ్ వంటి హీరోలు కొనసాగిస్తూ వచ్చారు. తాజాగా శింబు.. వాళ్ల సరసన చేరిపోయాడు.
శింబు గొప్ప మనసు.. కానుకలతో సిబ్బందికి సర్ప్రైజ్
తన సినిమాలో పని చేసిన సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు తమిళ హీరో శింబు. దీపావళి కానుకగా అందరికీ.. బంగారు నాణెం, కొత్తబట్టలు అందజేశాడు.
శింబు గొప్ప మనసు.. కానుకలతో సిబ్బందికి సర్ప్రైజ్
ఈశ్వరన్ చిత్రంలో నటించిన 200 మంది జూనియర్ ఆర్టిస్ట్‌లకు కూడా శింబు కొత్త బట్టలు అందజేసి, సంతోషంలో ముంచెత్తాడు. షూటింగ్ చివరి రోజు ఈ కానుకలను వారికి పంపిణీ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈశ్వరన్ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈశ్వరుడు పేరుతో విడుదల కానుంది.
ఇదీ చూడండి:మూడేళ్ల తర్వాత హీరో శింబు ఎంట్రీ