తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హీరో సిద్ధార్థ్​ను చంపేస్తామని బెదిరింపులు - హీరో సిద్ధార్థ్ మహాసముద్రం

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధార్థ్​కు హత్య బెదిరింపులు వస్తున్నాయి. దీనికి తమిళనాడు భాజపానే కారణమని ఇతడు ఆరోపణ చేశారు.

hero Siddharth death threats
హీరో సిద్ధార్థ్

By

Published : Apr 29, 2021, 2:21 PM IST

తన మొబైల్ నంబర్​ను భాజాపా తమిళనాడు ఐటీ సెల్​ లీక్​ చేసిందని ప్రముఖ హీరో సిద్ధార్థ్ ఆరోపించారు. దీనివల్ల తనతో పాటు కుటుంబసభ్యులను పలువురు ఫోన్ చేసి దూషించడం, రేప్ చేస్తామని అనడం, చంపేస్తామని బెదిరించడం చేస్తున్నారని ట్వీట్ చేశారు. అయితే ఆ కాల్స్ అన్నింటినీ రికార్డు చేశానని, వాటిని పోలీసులు అందజేయనున్నానని చెప్పారు.

సిద్ధార్థ్ ట్వీట్

గత 24 గంటల్లో 500కు పైగా కాల్స్ వచ్చాయని సిద్దార్థ్ తన ట్విట్టర్​లో రాసుకొచ్చారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాను ట్యాగ్​ చేస్తూ ఈ పోస్ట్ చేశారు. తనను పలువురు బెదిరించిన స్క్రీన్​షాట్​లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమిళనాడు బీజేపీ సభ్యులు కొందరు తన ఫోన్ నంబర్ లీక్ చేసి, తనపై దాడి చేసి, వేధించమని పోస్టులు పెడుతున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details