మనం ఓ పని గురించి వెళ్తుంటే అనుకోకుండా అభిమాన హీరో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. అప్పుడు ఎవరైనా ఏం చేస్తారు. ప్రస్తుతం అయితే ఓ సెల్ఫీ దిగుతారు. యువ హీరో శర్వానంద్ అదే చేశాడు. తన కొత్త చిత్రం 'రణరంగం' ట్రైలర్ లాంచ్ కోసం కాకినాడ వెళ్తుండగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఎదురుపడ్డాడు. అంతే చటుక్కున సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది.
ట్రెండింగ్: పవర్‌స్టార్‌తో గ్యాంగ్‌స్టర్ సెల్ఫీ - పవన్ కల్యాణ్
తన కొత్త సినిమా 'రణరంగం' ట్రైలర్ లాంచ్‌కు వెళుతూ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో సెల్ఫీ దిగాడు యువ హీరో శర్వానంద్. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను అనుకోకుండా కలిసిన హీరో శర్వానంద్
మాఫియా నేపథ్యంలో రూపొందిన 'రణరంగం'లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు శర్వా. ట్రైలర్‌ను త్రివిక్రమ్ చేతుల మీదుగా కాకినాడలో నేడు విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇది చదవండి: ఎన్కౌంటర్ శంకర్‌తో 'ఇస్మార్ట్ శంకర్'