'సాహో' లాంటి యాక్షన్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుజీత్. ఇప్పుడు మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. యువ హీరో శర్వానంద్‌తో మరోసారి కలిసి పనిచేయనున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడని టాక్.
ఈ కథనుత్వరలో శర్వానంద్‌కు వినిపించనున్నాడని సమాచారం. అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే రెండో చిత్రం ఇది అవుతుంది.