బైక్ ప్రమాదంలో గాయపడిన సినీనటుడు సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej health condition)కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు పూర్తిస్థాయిలో స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
కోలుకుంటున్న సాయితేజ్.. సర్జరీ చేసే అవకాశం! - సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదం
రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej road accident) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

తేజ్
శరీరం లోపల ఎలాంటి రక్తస్రావం కాలేదని స్పష్టం చేశారు. కాలర్ బోన్‌కు ఫ్రాక్చర్ కావడం వల్ల శస్త్రచికిత్స నిర్వహించడంపై వైద్యులు ఈరోజు (ఆదివారం) నిర్ణయం తీసుకోనున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించి నిర్ణయించనున్నారు.
ఇదీ చూడండి: సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించిన సినీప్రముఖులు
Last Updated : Sep 12, 2021, 1:32 PM IST