అతి త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ఇతడి వివాహం గురించి గత కొన్నిరోజులుగా పలు వెబ్‌సైట్లలో వరుస కథనాలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహామే చేసుకోనున్నారని, తన చిన్ననాటి స్నేహితురాలితో ఏడడుగులు వేయనున్నారని కథనాలు ప్రచురితమయ్యాయి. వచ్చే ఏడాది ఆరంభంలో బ్యాచ్‌లర్‌లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వీటన్నింటిపైనా సాయి స్పందించారు.
పెళ్లి వార్తలపై సాయిధరమ్ తేజ్ స్పందన ఇదే - hero sai tej solo brathuke so better
తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పిన సాయిధరమ్ తేజ్.. మీడియా ఆసక్తి చూపిస్తుండటం వల్లే రూమర్స్ ఎక్కువయ్యాయని అన్నారు.
త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు లేదని సాయిధరమ్ తేజ్ తెలిపారు. తగిన వధువును వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారని, దానికి ఓకే చెప్పానని ఆయన అన్నారు. తన పెళ్లి విషయంలో మీడియా వాళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, అందుకే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని వివరించారు.
సాయిధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఇందులో నభా నటేష్ హీరోయిన్గా నటించింది. సుబ్బు దర్శకత్వం వహించారు. మరోవైపు దర్శకుడు దేవకట్టా తీస్తున్న సినిమాలోనూ సాయి నటించనున్నారు.