హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్‌ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇంకా ఐసీయూలోనే ఉన్నారని వెల్లడించింది.
కోలుకుంటున్న సాయి తేజ్.. ఐసీయూలో పర్యవేక్షణ - saidharam tej accident
రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
సాయిధరమ్ తేజ్
శుక్రవారం రాత్రి, సాయిధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి మీద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తున్న క్రమంలో జారిపడటం వల్ల అతడికి కన్ను, ఛాతి, పొట్ట భాగంలో తీవ్రగాయాలయ్యాయి. తొలుత మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలోకు మార్చి సాయికి శస్త్రచికిత్స చేశారు.
ఇవీ చదవండి: