హీరో సాయిధరమ్ తేజ్‌కు సంబంధించిన తాజా హెల్త్ బులెటిన్‌ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. వైద్యానికి స్పందిస్తున్నారని, అంతర్గత అవయవాల పనితీరు స్థిరంగా ఉందని తెలిపింది. అంతర్గత అవయవాల్లో బ్లీడింగ్ లేదని పేర్కొన్నారు. కాలర్‌బోన్ గాయానికి శస్త్ర చికిత్సను 24 గంటల తర్వాత పరిశీలిస్తామని చెప్పారు.
sai dharam tej: హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్ బులెటిన్ - Hero sai dharam tej news
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మెగాహీరో సాయిధరమ్ తేజ్ వైద్యానికి స్పందిస్తున్నారు. ఈ విషయాన్ని అపోలో డాక్టర్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.
హీరో సాయిధరమ్ తేజ్
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో సాయి గాయపడ్డారు. దీంతో అతడిని తొలుత మెడికవర్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలో ఆస్పత్రికి మార్చి శస్త్రచికిత్స చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు సాయిధరమ్ తేజ్‌ను పరామర్శించారు. మెడికవర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తీసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి:
Last Updated : Sep 11, 2021, 6:52 PM IST