కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు అతడిని అభినందిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడం వల్ల నిలిచిపోయిన వృద్ధాశ్రమ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి, ఆర్థికంగా కానీ వస్తు రూపంలో కానీ సాయం చేయాలని కోరుతూ గతేడాది విజయవాడకు చెందిన 'అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ' పలువురు సెలబ్రిటీలతోపాటు సాయితేజ్‌ను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే సదరు ట్వీట్‌పై స్పందించిన తేజ్.. వృద్ధాశ్రమాన్ని తాను నిర్మించి ఇస్తానని.. అలాగే ఒక సంవత్సరం పాటు ఆశ్రమంలో అయ్యే ఖర్చులను కూడా తానే భరిస్తానని చెప్పాడు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ - అమ్మ ప్రేమ ఆదరణ సేవా సంస్థ
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. విజయవాడలో తాను నిర్మించి ఇస్తానన్న వృద్ధాశ్రమం భవన నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో సన్నిహితులు ట్విట్టర్ వేదికగా ఆ భవనం ఫొటోను పంచుకున్నారు. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తేజ్ సేవా గుణాన్ని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సాయి ధరమ్ తేజ్
తాజాగా సదరు భవన నిర్మాణం పూర్తయింది. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆశ్రమం ఫొటోను హీరో సన్నిహితులు ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్టుగానే అమ్మ ఆదరణ సేవా వృద్ధాశ్రమం కోసం భవన నిర్మాణాన్ని పూర్తి చేయించారు" అని పేర్కొన్నారు. తేజ్ చేసిన మంచి పని గురించి తెలుసుకున్న సినీ ప్రముఖులు, నెటిజన్లు.. అతడి సేవా గుణాన్ని కొనియాడుతూ కామెంట్లు పెడుతున్నారు