తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ టైటిల్​తో గోపీచంద్ సినిమా! - గోపీచంద్-తమన్నా

హీరో రవితేజ సినిమాకు పెట్టాలనుకున్న ఓ టైటిల్​ను గోపీచంద్ చిత్రం కోసం ఉపయోగించనున్నారట. ఈ విషయమై దర్శకుడు హరీశ్ శంకర్​తో చిత్రబృందం చర్చలు జరుపుతోందట.

రవితేజ టైటిల్​తో గోపీచంద్ సినిమా!
హీరో రవితేజ-హీరో గోపీచంద్

By

Published : Dec 26, 2019, 2:55 PM IST

రవితేజ టైటిల్‌లో గోపీచంద్‌ సినిమా ఏంటి అనుకుంటున్నారా? ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్‌.. మాస్ మాహారాజా రవితేజతో ఓ సినిమా తీయాలని అప్పట్లో అనుకున్నాడు. 'సీటిమార్‌' అనే టైటిల్‌ ఖరారు చేశాడని అప్పట్లో వార్తలొచ్చాయి. కారణం ఏదైనా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఇతర హీరోలతో బిజీ అయిపోయాడు హరీశ్. ఇప్పుడదే టైటిల్​ను గోపీచంద్‌ తీసుకోబోతున్నాడని టాలీవుడ్‌ టాక్‌.

హీరో గోపీచంద్‌-దర్శకుడు సంపత్‌ నంది కాంబినేషన్​లో ఇటీవలే ఓ చిత్రం ప్రారంభమైంది. క్రీడా నేపథ్య కథాంశంతో తీస్తున్నారు. ఈ సినిమాకే 'సీటిమార్‌' పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. కథాపరంగా ఈ పేరైతే బావుంటుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఈ విషయమై హరీశ్​తో చర్చలు జరిపారని, దాదాపు ఖరారనే వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇది చదవండి: 'చాణక్య' షూటింగ్ చివరి రోజు హీరో గోపీచంద్​కు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details