స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఈ సినిమా పట్టాలెక్కించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ కథ హీరో రవితేజ వద్దకు చేరిందని తెలిసింది. ఆయనకు నచ్చడం వల్ల.. సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని సమాచారం. దీనికి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించనున్నారు.
టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో రవితేజ - హీరో రవితేజ
గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథలో నటించడానికి హీరో రవితేజ అంగీకారం తెలిపారని సమాచారం. దీనికి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించనున్నారు.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంలా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అభిషేక్ అగర్వాల్. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. 70వ దశకంలో వరుస దోపిడీలు, దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. అప్పట్లో ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో కథలు కథలుగా చెప్పుకొనేవారు. రవితేజ ప్రస్తుతం 'రామారావు', 'ఖిలాడీ' సినిమాలతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు.
ఇదీ చదవండి:RRR movie: పిట్టగోడపై చెర్రీ- తారక్ సరదా ముచ్చట్లు