సినీనటులు, క్రికెటర్లు తమ గ్యారేజీలో ఎన్ని కార్లున్నా.. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త వాటిని చూసి మనసు పడతారు. తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు రణ్‌వీర్ సింగ్ కూడా భారీ ధర చెల్లించి ఓ కారు కొన్నాడు. లాంబోర్గిని యూరస్ మోడల్ (రెడ్)కు చెందిన ఈ వాహనం ధర రూ.3 కోట్లు. స్వయంగా ఆయనే కారును డ్రైవ్ చేస్తూ ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఖరీదైన కారులో రణ్‌వీర్ రయ్రయ్.. - bollywood actor ranveer singh lamborgini urus model red drives in mumbai
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కొత్త కారులో దర్శనమిచ్చాడు. లాంబోర్గిని యూరస్ మోడల్ ఎస్‌యూవీలో ముంబయి వీధుల్లో షికారు చేశాడు.
ఖరీదైన కారుతో హీరో రణ్‌వీర్ చక్కర్లు
ఇటీవల 'గల్లీబాయ్' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడీ స్టార్హీరో. ఈ చిత్రం విదేశీ భాషా చిత్ర విభాగంలో భారత్ నుంచి ఆస్కార్‌కు నామినేట్ అయింది. ప్రస్తుతం '83' అనే సినిమాలో నటిస్తున్నాడు రణ్‌వీర్.
ఇదీ చదవండి..