మహా శివరాత్రి సందర్భంగా విడుదలైన 'జాతిరత్నాలు' చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. కె.వి.అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో దర్శకుడు అనుదీప్‌కు పలు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం 'రెడ్' హీరో రామ్‌తో ఓ సినిమా చేయనున్నాడనే సినీ వర్గాలు టాక్ వినిపిస్తోంది.
'జాతిరత్నాలు' దర్శకుడితో హీరో రామ్ చిత్రం! - రామ్ పోతినేని అనుదీప్
'జాతిరత్నాలు' సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు కేవీ అనుదీప్‌కు టాలీవుడ్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. యువ కథానాయకుడు రామ్ హీరోగా అనుదీప్ ఓ సినిమా తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.
ఇప్పటికే కథకు సంబంధించి రామ్ కూడా ఓకే అనేశాడని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సహకారంతో స్రవంతి మూవీస్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి. ఇప్పటికే రామ్ - లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి:'అపరిచితుడు' హిందీ రీమేక్‌కు గ్రీన్‌సిగ్నల్