తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇస్మార్ట్' హిట్​ కావాలని అభిమాని సాహసం - పూరీ జగన్నాథ్

రామ్ 'ఇస్మార్ట్ శంకర్' హిట్ కావాలని ఓ అభిమాని తిరుపతి కొండను మోకాళ్లపై ఎక్కాడు. ఆ వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది నిర్మాత ఛార్మి.

'ఇస్మార్ట్' హిట్​ కావాలని అభిమాని సాహసం

By

Published : Jul 9, 2019, 5:35 PM IST

సినీ హీరోలపై అంతులేని ప్రేమ చూపిస్తుంటారు కొందరు అభిమానులు. వారి సినిమాలు హిట్ కావాలని పూజాలు, హోమాలు... ఇలా ఎన్నో చేస్తుంటారు. 'ఇస్మార్ట్​ శంకర్'​ కోసం ఓ అభిమాని ఏకంగా తిరుపతి కొండను మోకాళ్లపై ఎక్కాడు. ఆ వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది నిర్మాతల్లో ఒకరైన ఛార్మి.

ఇస్మార్ట్​ శంకర్​లో హైదరాబాదీ మాస్​ కుర్రాడి పాత్రలో రామ్ నటించాడు.నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. పూరీ జగన్నాథ్ దర్శకుడు. మణిశర్మ సంగీతమందించాడు. జులై 18న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: 'ఇస్మార్ట్ బోనాలు'.. చిత్రబృందం సందడి

ABOUT THE AUTHOR

...view details