'ఇస్మార్ట్ శంకర్'తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు హీరో రామ్. మాస్ పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆ తర్వాత 'రెడ్' సినిమాను పట్టాలెక్కించాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. శనివారం నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ గ్యాప్లో జిమ్లో కసరత్తులు చేస్తూ బిజీగా మారిపోయాడీ నటుడు.
2019లో పవర్లిఫ్టింగ్లో విజేతగా నిలిచిన శ్రీరామ్ వెంకటేశన్ ఆధ్వర్యంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు రామ్. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు. లిఫ్టింగ్ మిషన్‌పై వెంకటేశన్ కూర్చొని ఉండగా.. దానిని తన కాళ్లతో పైకి లేపుతూ కనిపించాడు. 'ఇక్కడ కేవలం బరువులు మాత్రమే ఎత్తట్లేదు.. ప్రేక్షకులు నాపై పెట్టుకున్న అంచనాలను మోస్తున్నా' అని ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు.