ఫేస్బుక్ మినహా ఇతర సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండే హీరో రామ్చరణ్.. ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచాడు. ఇకపై తన కొత్త ఫొటోల్ని, వివరాల్ని నేరుగా అభిమానులతో పంచుకోనున్నాడు. ఇప్పటివరకు చెర్రీకి సంబంధించిన విశేషాలను భార్య ఉపాసన.. సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించేది.
గతంలో ట్విట్టర్లో ఉన్న ఈ నటుడు.. కొన్నేళ్ల క్రితం ఆ ఖాతాను తొలగించాడు. ఇప్పుడు ఇన్స్టాలో అడుగుపెట్టగా అభిమానులు ఆనందపడుతున్నారు.