తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' టీజర్​పై ​చరణ్ ట్వీట్.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై - #RRRMovie

భీమ్ పాత్రకు సంబంధించిన వీడియో.. గురువారం ఉదయం విడుదల కానుంది. ఈ విషయమై హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్ మధ్య ట్విట్టర్​ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది.

RAM CHARAN ABOUT BHEEM FOR RAMARAJU TEASER
రామ్​చరణ్

By

Published : Oct 21, 2020, 12:59 PM IST

Updated : Oct 22, 2020, 10:41 AM IST

'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి 'రామరాజు ఫర్​ భీమ్​' టీజర్​ గురువారం ఉదయం 11 గంటలకు రానుంది. ఈ విషయాన్నే చెబుతూ.. 12 సెకన్ల వ్యవధి ఉన్న వీడియోను హీరో రామ్​ చరణ్ బుధవారం ట్వీట్ చేశారు. 'బ్రదర్ నిన్ను టీజ్​ చేసేందుకు వస్తున్నాను. ఈ సారి మాత్రం చెప్పిన సమయానికే' అని రాసుకొచ్చారు.

'రామ్​చరణ్ బ్రో.. నువ్వు ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యమనే విషయాన్ని గుర్తించాలి. మరో విషయం గుర్తుంచుకో, నువ్వు పనిచేస్తోంది జక్కన్నతో(రాజమౌళి). ఏమైనా జరగొచ్చు. ఏదైతేనేం చాలా ఆసక్తితో ఉన్నాను' అని జూ.ఎన్టీఆర్ రీట్వీట్ చేశారు.

ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. డీవీవీ దానయ్య.. సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Last Updated : Oct 22, 2020, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details