తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తెలుగు ప్రజలకు సినిమా అంటే ఓ సెలబ్రేషన్' - CINEMA NEWS

తెలుగువారికి సినిమాపై ఉన్న ఇష్టం గురించి చెప్పాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. హైదరాబాద్​లో బుధవారం జరిగిన 'అతడే శ్రీమన్నారాయణ' ప్రెస్​ మీట్​లో దీనితో పాటే పలు విషయాలు వెల్లడించాడు.

'తెలుగు ప్రజలకు సినిమా అంటే సెలబ్రేషన్'
హీరో రక్షిత్ శెట్టి

By

Published : Dec 19, 2019, 5:11 AM IST

కన్నడ హీరో రక్షిత్​ శెట్టి నటించిన సినిమా 'అతడే శ్రీమన్నారాయణ'. వచ్చే నెల 1న దక్షిణాదిలో నాలుగు భాషల్లోని ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో బుధవారం ప్రెస్​మీట్ ఏర్పాటు చేసిన చిత్రబృందం.. చిత్రవిశేషాలను పంచుకుంది. కథానాయకుడు రక్షిత్.. ఇక్కడ తన సినిమా విడుదల చేయడానికి గల కారణాలు వెల్లడించాడు.

హైదరాబాద్​ ప్రెస్​మీట్ అతడే శ్రీమన్నారాయణ చిత్రబృందం

"నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు వంశీ అని ఓ వైజాగ్ ఫ్రెండ్​ ఉండేవాడు. అతడికి సినిమా అంటే చాలా ఇష్టం. ఎందుకు అలా అని అడిగితే.. అది నేనొచ్చిన ప్రాంతం ప్రభావం అని చెప్పాడు. మా తెలుగు ప్రజలకు సినిమా అంటే ఓ సెలబ్రేషన్​ అని అన్నాడు. నేను ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి కారణమదే. మూడేళ్ల పాటు దాదాపు 200 మంది సిబ్బంది ఎంతో ఇష్టంతో చేసిన చిత్రమిది. ఈ సినిమాను ఇక్కడి ప్రజలు సెలబ్రేట్​ చేసుకోవడం నేను చూడాలి" -రక్షిత్ శెట్టి, హీరో

ఇందులో అవినీతి పోలీస్​గా రక్షిత్ నటించాడు. శాన్వి హీరోయిన్. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా తీశారు. సచిన్ రవి దర్శకత్వం వహించాడు.

అతడే శ్రీమన్నారాయణ రిలీజ్​పోస్టర్

ABOUT THE AUTHOR

...view details