తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డార్లింగ్ ప్రభాస్‌కు రూ.13 కోట్ల అడ్వాన్స్‌? - prabhas latest news

తమ సంస్థలో ఓ సినిమా చేసేందుకు దాదాపు రూ.13 కోట్లు అడ్వాన్స్​గా చెల్లించిందట ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. 2020 చివర్లో కానీ, 2021 మొదట్లో ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభం కానుంది.

డార్లింగ్ ప్రభాస్‌కు రూ.13 కోట్ల అడ్వాన్స్‌?
హీరో ప్రభాస్

By

Published : Dec 15, 2019, 3:38 PM IST

స్టార్ హీరో ప్రభాస్​తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పాన్‌ ఇండియా సినిమాను నిర్మించబోతుందా? ఇందుకోసం డార్లింగ్​కు ఇప్పటికే రూ.13 కోట్లు అడ్వాన్స్​గా ఇచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి చిత్రవర్గాలు.

ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలన్న ఆలోచన.. మైత్రీ మూవీ మేకర్స్​కు 'బాహుబలి' ముందు నుంచే ఉందట. అందుకే కొన్నేళ్ల క్రితమే అతడికి దాదాపు రూ.5 కోట్లు అడ్వాన్స్‌ ఇచ్చిందట. కానీ, అప్పటికే ప్రభాస్, యూవీ క్రియేషన్స్‌తో రెండు చిత్రాలు ఒప్పుకోవడం వల్ల ముందుగా ఆ నిర్మాణ సంస్థలోనే పని చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థ నుంచి 'సాహో' వచ్చింది. 'జాన్‌' సెట్స్‌పై ఉంది. ఇది వచ్చే ఏడాది చివరకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముందుగానే ప్రభాస్‌ను బుక్‌ చేసేసుకోవడానికి ఎందుకైనా మంచిదని మైత్రీ.. ఇటీవలే మరో రూ.8 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించిందట. మొత్తంగా డార్లింగ్‌కు ఇప్పటికే ఆ సంస్థ నుంచి రూ.13 కోట్లు అందినట్లయింది. కాబట్టి 'జాన్​' పూర్తయిన వెంటనే మైత్రీ మూవీస్‌ సంస్థలోనే ప్రభాస్ పని చేసే అవకాశాలున్నాయి.

హీరో ప్రభాస్

అంతేకాదు ఈ చిత్రాన్ని 2020 చివర్లో కానీ, 2021 ప్రారంభంలో కానీ సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మైత్రీ లక్ష్యంగా పెట్టుకుందట. ఇందుకోసం ఇప్పటికే డార్లింగ్ హీరో కోసం రకరకాల కథలను సిద్ధం చేస్తోంది. అందుకు తగ్గ దర్శకుడిని వెతికి పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ వార్తల్లో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ సంస్థ నుంచి ఇప్పటికే అడ్వాన్సులు అందుకున్న అగ్ర హీరోల్లో పవర్​స్టార్‌ పవన్‌ కల్యాణ్ ఒకడు.

ఇది చదవండి: 'బాహుబలి'ని మించిన సినిమాలో హీరో ప్రభాస్!

ABOUT THE AUTHOR

...view details