‘డార్లింగ్’ ఈ పేరు వినగానే సినీ అభిమానులకు గుర్తొచ్చే పేరు ప్రభాస్. తనతో స్నేహం చేసే ప్రతి ఒక్కరినీ ‘డార్లింగ్’ అంటూ పిలవడం ఆయనకు అలవాటు. అలా ఆ పేరుతోనే సినిమా తీసి, స్నేహితులతోనే కాదు, యావత్ తెలుగు సినీ ప్రేక్షకులతో ‘డార్లింగ్’ అనిపించుకున్నారు. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. విడుదలై నేటికి 10ఏళ్లు పూర్తి చేసుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా 2010 ఏప్రిల్23 న ప్రేక్షకుల ముందుకు వచ్చి, అందరి హృదయాలను గెలుచుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
- కథేంటంటే:
1980 ఫ్లాష్ బ్యాక్‌తో సినిమా మొదలవుతుంది. కొందరు కళాశాల మిత్రులు ఫేర్‌వెల్ అయిపోయిన తర్వాత ఎప్పటికీ ఇలా కలుస్తూనే ఉండాలని అనుకుని వెళ్లిపోతారు. ఆ స్నేహితుల్లో హనుమంతరావు (ప్రభు) కొడుకు ప్రభాస్ (ప్రభాస్/ప్రభ), విశ్వనాథ్(ఆహుతి ప్రసాద్) కుమార్తె నందిని (కాజల్ అగర్వాల్). ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పెరిగి పెద్దవాళ్లవుతారు. కాలేజ్‌లో ప్రభాస్‌ను చూసి నిషా (శ్రద్ధాదాస్) అతన్ని ప్రేమిస్తుంది. ప్రభాస్ కాదన్నందుకు ఆత్మహత్యయత్నం చేస్తుంది. ఈ విషయం నిషా తండ్రి (ముకేశ్ రుషి)కి తెలిసి ఎలాగైనా ప్రభాస్‌ను తీసుకొచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. తన మనుషుల్ని పంపి ప్రభాస్ స్నేహితులను బంధించి ‘నువ్వు రాకపోతే నీ వాళ్లను చంపేస్తా’ అని బెదిరిస్తాడు. స్నేహితులను కాపాడుకునేందుకు వచ్చిన ప్రభ ఏం చేశాడు? నిషాను పెళ్లి చేసుకున్నాడా? నందినిని ఎలా కలుసుకున్నాడు? అన్నదే కథ.
- సరదాగా సాగిపోతూ
ప్రభాస్ నుంచి ప్రేక్షకులు మాస్ సినిమానే ఆశిస్తారు. కానీ, ‘డార్లింగ్’లాంటి లవ్ ఎంటర్‌టైనర్‌తోనూ మెప్పించగలనని నిరూపించారాయన. ఎందుకంటే ఈ సినిమాకన్నా ముందు ఆయన నటించిన సినిమాలన్నీ ఆ కోవకు చెందినవే. ప్రథమార్ధమంతా సరదాగా సాగిపోతుంది. స్నేహితులను కాపాడుకునేందుకు నిషా తండ్రికి తన ప్రేమ కథను చెబుతాడు ప్రభాస్. తన స్నేహితులతో స్విట్జర్లాండ్ వెళ్లడం, అక్కడ నందిని చూసి ప్రేమించడం, ప్రభాస్, నందినిల మధ్య వచ్చే సరదా సన్నివేశాలతో ఫస్టాఫ్ అంతా హాయిగా గడిచిపోతుంది. ఇంటర్వెల్ సమయానికి ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. అదంతా అబద్ధమని చెప్పడం వల్ల థియేటర్‌లోని ప్రేక్షకుడు షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి అతడి స్నేహితుల రీయూనియన్ కార్యక్రమానికి అరకు వెళతాడు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన అక్కడకు నందిని ప్రేమను పొందడానికి ప్రభాస్ చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తాయి. అయితే, చివర్లో దర్శకుడు ఇచ్చిన మరో ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. విశ్వనాథ్, అతడి తండ్రి (కోట శ్రీనివాసరావు) మేనల్లుడైన రిషిని అప్పల్రాజు కొడుకుగా పరిచయం చేసి అతడితో నందని పెళ్లి చేయాలని అనుకుంటారు. చివరకు నందిని తన ప్రేమను ప్రభాస్‌కు చెప్పడం, ప్రభాస్ చెప్పిందంతా అబద్ధమని నిషా తండ్రికి తెలిసి దాడి చేయడానికి రావడం.. చివరిలో ప్రభాస్-నందినిల ప్రేమ తెలుసుకుని వెళ్లినప్పుడు కథ సుఖాంతం అవుతుంది.
- రిస్క్ చేసిన కరుణాకరన్