ఐడీ కార్డు వేసుకున్న ఎన్టీఆర్‌ని మీరు ఎప్పుడైనా చూశారా? లేదు అంటే ఇప్పుడు ఇక్కడ చూసేయండి. అయినా ఎన్టీఆర్‌కు ఐడీ కార్డుతో పనేంటి అనుకుంటున్నారా? విద్యార్థులు, ఉద్యోగులకు ఉన్నట్టే సినిమాలకు పనిచేసే ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డు ఉంటుంది. విదేశాలకు వెళ్తే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రస్తుతం తారక్ ఉక్రెయిన్‌లో ఉన్నారు. అందుకే ఐడీ కార్డు ధరించారు. 'నేను ఐడీ కార్డు వేసుకుని చాలా సంవత్సరాలైంది. తొలిసారి సెట్స్‌లో ఇలా' అంటూ ఆ ఫొటోల్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తోపాటు దర్శకుడు రాజమౌళి తన ఐడీ కార్డు చూపిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
'ఆర్ఆర్ఆర్' సెట్లో తారక్ ఫొటో వైరల్ - ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్డేట్స్
'ఆర్ఆర్ఆర్'(RRR Movie) షూటింగ్లో పాల్గొన్న హీరో ఎన్టీఆర్.. సెట్స్‌లో తనకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. తన కెరీర్లో 'ఇలా జరగడం ఇదే తొలిసారి' అంటూ రాసుకొచ్చారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే?
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో 'ఆర్ఆర్ఆర్' నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan), కొమురం భీమ్‌గా తారక్(NTR) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్‌గణ్, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'భీమ్ ఫర్ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదీ చూడండి: ఉక్రెయిన్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం