తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సింపుల్​గా నితిన్​, షాలినిల నిశ్చితార్థం

హైదరాబాద్​లో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో బుధవారం షాలిని, నితిన్​ల​ నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 26న ఫలక్​నుమా ప్యాలెస్​లో వివాహం నిశ్చయించారు.

hero nithon, lover shalini engagement today
సింపుల్​గా నితిన్​, షాలినిల నిశ్చితార్థం

By

Published : Jul 22, 2020, 4:55 PM IST

టాలీవుడ్​ హీరో నితిన్​ పెళ్లి కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బుధవారం అతని నివాసంలో నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 26న హైదరాబాద్​లోని ఫలక్​నుమా ప్యాలెస్​లో రాత్రి 8.30 నిమిషాలకు షాలిని, నితిన్​ల వివాహం జరగనుంది.

నితిన్​, షాలిని

నితిన్​ది అరేంజ్డ్​ కమ్​ లవ్​ మ్యారేజ్​. నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించడం వల్ల.. తమ కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారు.

డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆకాంక్షించిన ఈ హీరో.. కరోనా వైరస్ కారణంగా తన వివాహన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కానీ కొవిడ్ కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్​లోనే కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకునేందుకు నితిన్ సిద్ధమయ్యాడు.

ABOUT THE AUTHOR

...view details