తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నితిన్​కు మూడు గెటప్పులు.. హాలీవుడ్ నిపుణులు - nithin powerpeta

యువహీరో నితిన్.. తన కొత్త సినిమాలో ప్రయోగం చేయబోతున్నాడు. ఏకంగా మూడు విభిన్న వేషధారణల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం హాలీవుడ్​ నిపుణులు పనిచేయనున్నారట.

నితిన్​కు మూడు గెటప్పులు.. హాలీవుడ్ నిపుణులు
హీరో నితిన్

By

Published : Jun 26, 2020, 7:01 AM IST

కథానాయకుడు నితిన్.. వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన 'రంగ్​దే', 'అంధాదున్' రీమేక్​తో పాటు చంద్రశేఖర్ యేలేటి సినిమాలోనూ నటిస్తన్నారు. ఇవన్నీ ఇప్పటికే సెట్స్​పైకి వెళ్లాయి. వీటితో పాటే కృష్ణచైతన్యతో 'పవర్​పేట' అనే చిత్రాన్ని చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇది నితిన్ కెరీర్​లోనే అత్యంత భారీ చిత్రం. దీనిని రెండు భాగాలుగా తీయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిని సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పూర్వనిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. కరోనా పరిస్థితులు చక్కబడితే అప్పుడు సినిమాను ప్రారంభించేలా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

1960 నుంచి 2020 వరకూ

'పవర్​పేట'.. ఓ వైవిధ్య కథతో రూపొందనున్న పీరియాడికల్ చిత్రం. 1960 నుంచి 2020 వరకు నడిచే కథాంశమని సమాచారం. దీంట్లో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా, 40 ఏళ్ల వ్యక్తిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా దర్శనమివ్వబోతున్నాడు. ఇప్పుడీ గెటప్పుల కోసమే ప్రత్యేకంగా హాలీవుడ్ నిపుణులను తీసుకొస్తున్నారట. ఇందులో కథానాయికగా కీర్తి సురేశ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్​దే' చిత్రంలో నటిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details