టాలీవుడ్ హీరో నితిన్, షాలినిల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ ఫలక్‌నుమా హోటల్ ఇందుకు వేదికైంది. ఈ క్రమంలోనే నవ వరుడు నితిన్‌కు ఓ అద్భుతమైన బహుమతి లభించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా వివాహ వేడుకలో పాల్గొని నితిన్‌ని ఆశీర్వదించాడు. ఆయనతో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ కూడా వచ్చారు. దీంతో పవన్ వీరాభిమానైన నితిన్ సంతోషానికి అవుధులు లేకుండా పోయాయి.
మెహందీ వేడుకలో మెరిసిన నితిన్, షాలిని - hero nithin marriage news updates
టాలీవుడ్ యువ హీరో నితిన్, షాలినిల వివాహ వేడుక తాజ్ ఫలక్నామా హోటల్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ హాజరయ్యారు.
నితిన్, షాలిని
కరోనా కారణంగా విధించిన ప్రభుత్వ నియమ నిబంధనలనకు అనుగుణంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి 8.30 నిమిషాలకు నితిన్.. షాలిని మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.